- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన లారీ
by Taduka Kalyani |
చేర్యాల ప్రధాన జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, చేర్యాల: చేర్యాల ప్రధాన జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ఆకుల లక్ష్మయ్య(57) జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా జనగామ నుంచి చేర్యాల వైపుకు వస్తున్న లారీ ఢీ కొనడంతో లక్ష్మయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు అబులెన్స్ లో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






