- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి గోడపైకి దూసుకెళ్లిన కారు
by velandi.Saikiran |
శంకరపట్నం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడపైకి దూసుకెళ్లింది.

X
దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉండగా ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... వీణవంక మండలం గన్ముకుల గ్రామానికి చెందిన ఓ కుటుంబం, హుజురాబాద్ ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను పరామర్శించి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయంతో గోడపై నుండి కారును తొలగించారు. శంకరపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






