గుండ్ల పోచంపల్లి రైల్వే అండర్‌పాస్ నిర్మాణానికి కసరత్తు

by velandi.Saikiran |

గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ప్రతిపాదిత రైల్వే అండర్‌పాస్ నిర్మాణ స్థలాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు, రైల్వే ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలించారు.

గుండ్ల పోచంపల్లి రైల్వే అండర్‌పాస్ నిర్మాణానికి కసరత్తు
X

దిశ,మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ప్రతిపాదిత రైల్వే అండర్‌పాస్ (ఆర్‌యూబీ) నిర్మాణ స్థలాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు, రైల్వే ఉన్నతాధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, రూట్ మ్యాప్‌ను అధికారులు పరిశీలించి, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గుండ్లపోచంపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం బీజేపీ లక్ష్యమని అన్నారు. అండర్‌పాస్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.

ఈ పరిశీలనలో రైల్వే అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కావేరీ శ్రీధర్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, బీజేపీ నాయకులు జైతువాలా కిషన్, మలిగే అశోక్, బట్టికడి నవనీత్, నవీన్ కుమార్, అరుణ్, నాని, శ్రవణ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story