చర్లపల్లి జైలు నుండి బండి భగీరథ్‌ విడుదల

by Malleboina Mahesh |

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ రావడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు.

చర్లపల్లి జైలు నుండి బండి భగీరథ్‌ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బండి భగీరథ్ పై పోక్సో కేసు (POCSO case) నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నింధితుడు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్‌‌కి (Bandi Bhagirath) భారీ ఊరట లభించింది. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై నమోదైన కేసులో గత కొన్ని రోజులుగా చర్లపల్లి కేంద్ర కారాగారం (Cherlapalli Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు గురువారం (జూలై 9, 2026) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

జైలు నుంచి విడుదల..

హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ కాపీలు శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలు అధికారులకు అందాయి. న్యాయపరమైన ప్రక్రియలన్నీ ముగిసిన అనంతరం, శుక్రవారం (జూలై 10, 2026) మధ్యాహ్నం బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి అధికారికంగా విడుదలయ్యారు. కాగా, కోర్టు విధించిన షరతుల ప్రకారం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని, సాక్షులను ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Next Story