- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాస్తు కోసమా... వంట చెరుకు కోసమా..?
"వాస్తు కోసం చెట్లు నరికారా... లేక వంట చెరుకు కోసమా..?" అనే అనుమానాలు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో వ్యక్తమవుతున్నాయి.

దిశ, ఏన్కూరు : "వాస్తు కోసం చెట్లు నరికారా... లేక వంట చెరుకు కోసమా..?" అనే అనుమానాలు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో వ్యక్తమవుతున్నాయి. జూనియర్ కళాశాల గిరిజన హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పచ్చని చెట్లను ఇటీవల నరికివేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండల కేంద్రంలోని పాత సీఎల్‌ఆర్‌సీ భవనంలో ప్రస్తుతం గిరిజన విద్యార్థుల హాస్టల్ నిర్వహిస్తున్నారు. హాస్టల్ ఆవరణలో ఎన్నో సంవత్సరాలుగా పెరిగి నీడనిస్తున్న చెట్లను వాస్తు కారణాలు చూపుతూ తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నరికివేసిన చెట్లను వంట చెరుకుగా వినియోగించేందుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటాలని ప్రోత్సహిస్తుండగా, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే పచ్చని చెట్లను నరికివేయడం పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోంది. చెట్ల నరికివేతకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారా లేదా అనే అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రాంగణంలో ఉన్న చెట్లను నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, నిజంగా వాస్తు కారణమేనా లేక ఇతర ఉద్దేశాలు ఉన్నాయా అనే విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, చెట్ల నరికివేతకు గల అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.






