ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం

by Ratna Kumari |

సదాశివనగర్ మండలం మొడేగాం గ్రామ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా వంగి ప్రమాదకరంగా మారింది.

ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం
X

దిశ, సదాశివనగర్ : సదాశివనగర్ మండలం మొడేగాం గ్రామ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా వంగి ప్రమాదకరంగా మారింది. పద్మాజీవాడి చౌరస్తా నుంచి మొడేగాం గ్రామానికి వెళ్లే చెరువు గట్టు మార్గంలో ఉన్న ఈ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వర్షాకాలం నేపథ్యంలో స్తంభం కూలితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగక ముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, దెబ్బతిన్న స్తంభాన్ని వెంటనే మార్చడం లేదా మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరుతున్నారు.

Next Story