ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు

by Ratna Kumari |

ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కల్పన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు
X

దిశ, ముప్కాల్ : ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కల్పన ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని సూచించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

మండల విద్యాధికారి ఎం.గంగారాం, కల్పన ట్రస్ట్ అధ్యక్షుడు జి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story