ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను ఆధునికరించాలి

by Ratna Kumari |

ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ బోనకల్ మండల కన్వీనర్ ఇండ్ల సుధాకర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను ఆధునికరించాలి
X

దిశ, బోనకల్ : ప్రభుత్వ విద్య మసకబారుతుందని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయని, విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరిష్కారమే మార్గమని ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఉపసహరించుకోవాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ బోనకల్ మండల కన్వీనర్ ఇండ్ల సుధాకర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్థానిక శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టిన బంద్ లో భాగంగా బోనకల్ మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యాసంస్థల బంద్ సంపూర్ణం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు కల్పన లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయితే విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులుకు గురికావాల్సి వస్తుందని, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఉపాధ్యాయులపై ఉందన్నారు. గత పదేళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయ మరియు లెక్చరర్స్ నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యపై దృష్టి సారించి ప్రభుత్వ విద్య వ్యవస్థను పటిష్టం చేయాలని అయన అన్నారు.గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల విద్య రంగానికి ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు ప్రభుత్వం కొలువుదీరి 3, సంవత్సరాలు కావస్తున్నప్పటికి కనీసం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అంత్యంత బాధాకరమని వారు అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం , ప్రభుత్వ విద్య రంగంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలను కళాశాలను ఆధునికరించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు స్థానంలో సొంత భవనాలు నిర్మించి గురుకుల సంక్షేమ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల పైచిలుకు పెండింగ్ బకాయలను తక్షణ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారి హెచ్చరించారు. ఈ బంద్ కు సహకరించిన విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులకు మేధావులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మడుపల్లి గోపి ఇండ్ల సంతోష్ తాళ్లూరు అభిలాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story