- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR: ఆన్‍లైన్‍లో ఎన్యూమరేషన్ పత్రాలపై సీఈవో క్లారిటీ
ఓటర్ల ప్రక్షాళనలో భాగంగా ఎస్ఐఆర్ (SIR) చేపడుతున్నామని, ఎన్యూమరేషన్ పత్రం నింపితేనే ఓటు హక్కు ఉంటుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఎస్ఐఆర్ చేపడుతున్నామని, ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఓటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి వ్యక్తికి రెండు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తామని రెండూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపి ఒకటి బీఎల్‍వోకు ఇవ్వాలని రెండో ఎన్యూమరేషన్ పత్రాన్ని ప్రజల దగ్గరే ఉంచుకోవాలన్నారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక వేళ ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వలేకపోయినా, డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్-6 ఇవ్వాలన్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ జరుగుతుందన్నారు.
ఆన్ లైన్‍లో ఎన్యూమరేషన్ నింపవచ్చు:
ఈసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపవచ్చని స్పష్టం చేశారు. రోహింగ్యాలకు ఓటు హక్కు ఉంటే వారికి 2002 వివరాలు ఉండవు కాబట్టి వారికి నోటీసులు ఇస్తామని నోటీసుల సమయంలో ఫిల్టర్ అవుతుందన్నారు. ఓటును కావాలనే తొలగించరని అలా తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదన్నారు. ఓటు తొలగించే ముందు.. సంబంధింత ఓటరుకు సమాచారం ఇచ్చే తీసేయ్యాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా బీఎల్వోలపై వస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తామన్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేసి ఫిల్ చేయవచ్చు.






