- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

దిశ, కడ్తాల్: గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కర్కల్ పహాడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,సర్పంచ్ తేజీరాం నాయక్, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు పోతుగంటి శంకర్, ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






