- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘420’ హామీలతో కాంగ్రెస్ దగా చేసింది
శుక్రవారం గంగాధర మండల కేంద్రంలో బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

దిశ, గంగాధర : ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేడు వాటిని అమలు చేయకుండా ‘420 పార్టీ’గా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఆ పార్టీని గద్దె దించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలో బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ‘బీఆర్‌ఎస్ - కాంగ్రెస్ దొందూ దొందే’ అని విమర్శించారు. మరోవైపు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెస్తున్న జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, ఈజీఎస్ నిధులతోనే కరీంనగర్ జిల్లా ముఖచిత్రం మారుతోందని కొనియాడారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, డిప్యూటీ మేయర్ సునీల్ రావు బలపరిచారు. కిసాన్ మోర్చా నేత సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన వ్యవసాయ తీర్మానాన్ని మేయర్ కోలగాని శ్రీనివాస్, బత్తుల లక్ష్మీనారాయణ బలపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






