విద్యాసంస్థల బంద్ విజయవంతం

by Ratna Kumari |

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా ములకలపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.

విద్యాసంస్థల బంద్ విజయవంతం
X

దిశ, ములకలపల్లి : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా శుక్రవారం ములకలపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకుడు ముదిగొండ ప్రశాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రిని నియమించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్ నివారణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు తెల్లం అఖిల్‌తో పాటు శరత్, కళ్యాణ్, సంజయ్, శేఖర్, నాగచైతన్య, నిశాంత్, దీపు, వంశీ, సాంబ, దోణి, నిఖిల్, గోపిక, స్వాతి, లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story