- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్రంతోనూ సంప్రదించాలని భావిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై సోషల్ మీడయాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా(Social Media)లో దుష్ప్రచారాలపై ప్రభుత్వం(Government) సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్రంతోనూ సంప్రదించాలని భావిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాపై ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting)లో చర్చించారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై సోషల్ మీడయాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. నియంత్రణకు ప్రత్యేక మెకానిజం తీసుకురావాలని మంత్రులు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta)కి సూచించారు. దీంతో కేబినెట్ భేటీలో సోషల్ మీడియా అంశంపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అవరసమైతే కేంద్రప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోషల్ మీడియా దుష్ప్రచారం, అనుచిత ప్రవర్తనపై చర్యల సిఫార్సులకు జీవోఎం సమావేశం నిర్వహించాని సూచించారు. ఈ జీవోఎంలో సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత(Vangalapudi Anitha), నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), సత్యకుమార్ యాదవ్(Satya Kumar Yadav) ఉండనున్నారు.
సోషల్ మీడియా ఓ రోగంగా మారింది...
‘‘సమాజానికి సోషల్ మీడియా ఓ రోగంగా మారింది. తద్వారా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను కొందరు సోషల్ మీడియా ద్వారా అవమానిస్తున్నారు. వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తులను కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటున్నాయి. అందువల్ల రాష్ట్రస్థాయి రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. సోషల్ మీడియా దుర్వినియోగం ఆరోపణల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.






