- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకు న్యాయం చేయండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన కేతన్ అగర్వాల్ తండ్రి
తమకు న్యాయం చేయాలంటూ కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన కేతన్ అగర్వాల్ తండ్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు భావోద్వేగ లేఖ రాశారు. తన కొడుకు చనిపోయిన 20 రోజుల్లోనే తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమకు న్యాయం చేయాలంటూ కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన కేతన్ అగర్వాల్ తండ్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు భావోద్వేగ లేఖ రాశారు. తన కొడుకు చనిపోయిన 20 రోజుల్లోనే తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యాపారవేత్తగా లేదా ప్రభావశీలిగా తాను లేఖ రాయడం లేదని, తన కుమారుడికి న్యాయం కోరుతూ తండ్రిగా, బాధతో నిండిన హృదయంతో లేఖను రాస్తున్నానని పేర్కొన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి, నిందితులకు చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని ఆయన కోరారు.
ఇదిలా ఉంటే కేతన్ అగర్వాల్ హత్య అనంతరం రెండు వారాల్లోనే తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత కన్నుమూశారు. ఓవైపు కొడుకు మరోవైపు తండ్రి మరణించడంతో కేతన్ అగర్వాల్ తండ్రి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సియా గోయల్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కేతన్ అగర్వాల్‌తో ఎంగేజ్మెంట్ జరగడానికి ముందే సియాకు తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి జరిగిందని పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని నిర్దారించారు.






