- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కదా ఇంజినీరింగ్ అంటే..! ‘పేపర్ ఫ్లైట్’తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థులు సరికొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నతనంలో మనం కాగితంతో విమానాలు, రాకెట్లను చేసి గాల్లోకి ఎగరేయడం మనందరికీ గుర్తే ఉంటుంది. అయితే, తాజాగా అదే సరదాను సీరియస్‌గా తీసుకున్న కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద కాగితపు విమానాన్ని (Paper Plane) తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్ పుటల్లోకి ఎక్కారు. దాదాపు ఆరు అంతస్తుల భవనమంత పొడవున్న పేపర్ ఫ్లైట్‌ను గాల్లో అద్భుతంగా ఎగిరి వీక్షకులను కట్టిపడేసింది.
ఆ రికార్డును బద్దలుకొట్టాలని పట్టుదలతో..
అయితే, ఇటీవల ఇటలీలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ పిసా (University of Pisa)కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థులు పరీక్షల కోసం చదువుకుంటున్న సమయంలో ఈ వినూత్న ఆలోచన చేశారు. సరదాగా క్లాస్ బ్రేక్‌లలో కాగితపు విమానాలు ఎగరేస్తూ.. సరైన ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తే ఒక చిన్న కాగితాన్ని కూడా అద్భుతంగా మార్చవచ్చని నమ్మారు. ఈ క్రమంలోనే 2013లో జర్మనీకి చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 7 మంది విద్యార్థుల బృందం మరో 16 మంది సహాయకులతో కలిసి ‘ఇకార్స్’ (Icarus) అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఫ్లైట్ రెక్కలు పొడవు 65.75 అడుగులు అంటే ఓ సిటీ బస్సు పొడవు కంటే ఎక్కువగా ఉన్నాయి. విమానం బాడీ పొడవు 23 అడుగులు, 28.5 కిలలో బరువుతో రూపొందించారు. అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి.. ప్రపంచంలోనే అతిపెద్ద కాగితపు విమానంగా ధృవీకరిస్తూ విద్యార్థుల బృందానికి సర్టిఫికెట్ అందజేశారు.






