వాహనదారులకు మరో బిగ్ అలర్ట్: E20 పెట్రోల్‌‌పై కేంద్రం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

బయోఫ్యూయల్ విధానంతో దేశంలో స్వదేశీ ఇంధన భద్రత గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వాహనదారులకు మరో బిగ్ అలర్ట్: E20 పెట్రోల్‌‌పై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణే టార్గెట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ20 (E20) పెట్రోల్‌పై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (Ethanol)ను మిక్స్ చేయడం వల్ల వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం అధికారికంగా పేర్కొంది. అయితే, మైలేజీ తగ్గుదల కంటే E20 ఇంధనం ద్వారా దేశానికి, పర్యావరణానికి చేకూరే ప్రయోజనాలే చాలా ఎక్కువని అధికారులు స్పష్టం చేశారు. ఈ20 పెట్రోల్ వాడకంతో కాలుష్యం భారీగా తగ్గడమే కాకుండా, వాహనాల ఇంజన్ పనితీరు మరింత మెరుగై పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది.

మరోవైపు బయోఫ్యూయల్ (Biofuel) విధానంతో దేశంలో స్వదేశీ ఇంధన భద్రత గణనీయంగా పెరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం క్రమంగా తగ్గుతూ వస్తుందని పేర్కొంది. ఈ20 ఇంధన వినియోగం, దాని భద్రతపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని.. 2001 నుంచే దీనిపై సుదీర్ఘంగా పరిశోధనలు, పరీక్షలు జరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story