RSP భద్రతను తొలగించే ఆలోచనను ఉపసంహరించుకోవాలి

by velandi.Saikiran |

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగించే ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్వేరో వనపర్తి జిల్లా వైస్ ప్రెసిడెంట్ తోలు రామకృష్ణ డిమాండ్ చేశారు.

RSP భద్రతను తొలగించే ఆలోచనను ఉపసంహరించుకోవాలి
X

దిశ, వనపర్తి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగించే ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్వేరో వనపర్తి జిల్లా వైస్ ప్రెసిడెంట్ తోలు రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించవద్దంటూ స్వేరోస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగాస్వేరో వనపర్తి జిల్లా వైస్ ప్రెసిడెంట్ తోలు రామకృష్ణ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కక్షపూరి తంగా వ్యవహరించడం సమంజసం కాదని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే భద్రతను తొలగిస్తారా అని ప్రశ్నించారు? అధికారంలో ఉన్నామని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి జెడ్ కేటగిరి భద్రత కల్పించడం దుర్మార్గ‌మంటూ సీరియ‌స్ అయ్యారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కక్షపూరిత చర్యలను మానుకోకుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

Next Story