వయసు పెరిగినా తగ్గని గ్లామర్.. అదుర్స్ అనిపించే అందాలతో ఫిదా చేస్తున్న విమలా రామన్

by Pulgam srinivas |

44 ఏళ్ల వయసులోనూ విమలా రామన్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.

వయసు పెరిగినా తగ్గని గ్లామర్.. అదుర్స్ అనిపించే అందాలతో ఫిదా చేస్తున్న విమలా రామన్
X

దిశ, వెబ్‌ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ విమలా రామన్ తమిళ చిత్రం 'పోయి'తో వెండితెరకు పరిచయమైంది. అనంతరం 'టైం' సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.




ఇక 2009లో విడుదలైన 'ఎవరైనా ఎప్పుడైనా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇందులో విమలా రామన్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం మరికొన్ని తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది.




అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులోనూ విమలా రామన్ తన గ్లామర్‌ను అద్భుతంగా మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా విమలా రామన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.




వాటిలో లైట్ పింక్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. తన ఎద, నడుము అందాలు హైలైట్ అయ్యేలా విభిన్న పోజులు ఇచ్చింది. కురులను కొన్నిచోట్ల ముఖంపైకి వదిలి, మరికొన్ని ఫోటోల్లో వెనక్కు వేసుకుని ట్రెండీ లుక్‌లో మెరిసింది. ఒక చేతికి బ్రేస్‌లెట్, వేళ్లకు ఉంగరాలు ధరించి తన స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించింది.




మొత్తంగా ఆమె గ్లామరస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుండగా, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story