- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్ ముట్టడి.. యూఎస్‌ఎఫ్‌ఐ నేతల అరెస్ట్..
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.

దిశ, ఖైరతాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (యూఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి నాయకత్వంలో ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పంజాగుట్ట వద్ద సుమారు 20 మంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలని, ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వార్డెన్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచడం, ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో చేర్చడం, బీసీ హాస్టళ్లలో అమలు చేస్తున్న ఆన్‌లైన్ ప్రవేశ విధానాన్ని ఉపసంహరించుకోవడం, మెస్ ఛార్జీలు, ఇతర భత్యాలను పెంచడం, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాభవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకుని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






