అయ్యవారిపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు

by velandi.Saikiran |

కాంగ్రెస్ నాయకులు పండుగ ప్రదీప్ రెడ్డి తమ సొంత నిధులతో గ్రామంలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అయ్యవారిపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు
X

దిశ, మిడ్జిల్ : అయ్యవారిపల్లి గ్రామంలో ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పండుగ ప్రదీప్ రెడ్డి తమ సొంత నిధులతో గ్రామంలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం సీసీ కెమెరాలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ , స్థానిక ఎస్సై శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో నేరాల నివారణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ బంగారయ్య, వార్డు సభ్యులు గొర్ల శ్రీను , ఎడ్ల గోపాల్, మాసయ్య , శిరీష నాగరాజు. సీనియర్ నాయకులు చుక్కయ్యా, పండుగ ప్రవీణ్ రెడ్డి , కమ్మరి మల్లేష్, వెంకటయ్య, అధ్యక్షుడు శివాజీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story