ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

by velandi.Saikiran |

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పురస్కరించాలని పలువురు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్
X

దిశ , కాప్రా: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పురస్కరించాలని పలువురు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు పేర్కొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ కాప్రా పట్టణంలో ప్రశాంతంగా ముగిసింది. అయితే వామపక్ష విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునివ్వడంతో... కాప్రా పట్టణంలోనీ ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, సైనిక్పురి తదితర ప్రాంతాల్లోని ప్రవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందును పాటించాయి. ఇక కుషాయిగూడ, కాప్రా, తదితర ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి తరగతులను బహిష్కరించి పాఠశాలను మూసివేయించారు.

ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల కార్యదర్శి మహేష్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని , ప్రైవేట్–కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని , రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని , ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఎంఈఓ, డీఈవో, తదితర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని , ప్రభుత్వ విద్యాసంస్థలకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని , ఆర్ టి ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి అనే న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బంద్ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షడు గిరిబాబు, శేఖర్...ఏఐఎస్ఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు అలీ, ఇర్ఫాన్, సమీర్, కిరణ్, ఆశ్రఫ్, ఉమేష్, గణేష్, లోకేష్ లతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story