- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావాజిపల్లి మద్యం నిషేధించాలని గ్రామస్తుల తీర్మానం..
by Kodari Anjali |
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజిపల్లి గ్రామంలో మద్యం నిషేధించాలని శుక్రవారం గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు.

X
దిశ, నాగర్ కర్నూల్ /తిమ్మాజిపేట: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజిపల్లి గ్రామంలో మద్యం నిషేధించాలని శుక్రవారం గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. గ్రామంలోని ప్రజలు అందరూ గుడి ముందు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే లక్ష జరిమాన విధిస్తామని చెప్పారు. మద్యం అమ్మినట్లు ఎవరైనా సమాచారం ఇస్తే రూ. 20 వేల బహుమానం ఇస్తామన్నారు. గ్రామస్థులు అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు.
Next Story






