'రణబాలి'కి కొత్త చిక్కు.. దిల్ రాజు వ్యూహం మారనుందా?

by Pulgam srinivas |

ఒకే నెలలో 'రణబాలి', 'రౌడీ జనార్ధన' విడుదల కాకుండా ఉండేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

రణబాలికి కొత్త చిక్కు.. దిల్ రాజు వ్యూహం మారనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన అనే రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి ప్రణాళిక ప్రకారం రణబాలి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసి, ఆ తర్వాత దాదాపు మూడు నెలల గ్యాప్‌తో డిసెంబర్‌లో రౌడీ జనార్ధనను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే ప్రస్తుతం రణబాలి షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌కు బదులుగా అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ ఇప్పటికే ఆ సీజన్‌లో పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఇప్పుడు నవంబర్ లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రౌడీ జనార్ధన నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ఒకే నెలలో విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు విడుదలైతే వాటి కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో రౌడీ జనార్ధన విడుదల తేదీ విషయంలో కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై ఆసక్తి నెలకొంది.

Next Story