వనస్థలిపురంలో ఆర్టీసీ బస్సు ఢీ.. గుర్తుతెలియని వ్యక్తి పరిస్థితి విషమం

by Taduka Kalyani |

వనస్థలిపురంలో ఆర్టీసీ బస్సు ఢీ.. గుర్తుతెలియని వ్యక్తి పరిస్థితి విషమం
X

దిశ, హస్తినాపురం: నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోనగర్‌లోని రాజధాని హోటల్ సమీపంలో ఆర్టీసీ బస్సు యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బాధితుడికి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహకారంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఎరుపు రంగు షర్టు, నీలం రంగు జీన్స్ ధరించి ఉండగా, అతని వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదని, అతని కుటుంబ సభ్యులు లేదా వివరాలు తెలిసిన వారు వెంటనే వనస్థలిపురం పోలీసులను 8712662280 లేదా 8712662300 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు, పాదచారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Next Story