- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాటం చేస్తే మెడికల్ బోర్డు పెట్టారు: టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పదవ తరగతికి సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఏమిటని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

దిశ, మణుగూరు: డిపెండెంట్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం డోలాయ మానంలో పడేసిందని తెలంగాణ రక్షణ సేన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె శుక్రవారం సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా పీకేఓ సీటు గాని నందు హెచ్ ఎం ఎస్ యూనియన్ నాయకులతో కలిసి బాయ్ బాట కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీబీజీకేఎస్‌లో ఉన్నప్పుడు ఎన్ మైనస్ వన్ అనే దానిపై నాకు అవగాహన లేదని, నన్ను కన్విన్స్ చేసి తీసుకువచ్చారని, పీహెచ్డీ 50 శాతం కోతతో తీసుకు రావడం జరిగిందన్నారు. కార్మికులందరూ తన క్షమించాలని నా తప్పను సరదిద్దుకొని మీ పక్షాన పోరాటం చేస్తానన్నారు. సింగరేణి సంస్థలు మూడువేల ఖాళీలు ఉన్నాయని, డిపెండెంట్ పెట్టుకున్న వారిని ప్రాసెస్ చేస్తే ఖాళీలు భర్తీ అవుతాయి అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి 30 నెలలు అవుతుందని అప్పుడు మెడికల్ బోర్డు పెట్టి 54 మందిని ప్రాసెస్ చేసి కేవలం నలుగురిని ఎంపిక చేసి 50 మందిని వదిలి పెట్టారన్నారు. 2000 అప్లికేషన్స్, అన్ఫిట్ అయిన 700 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వారు మాకు సమయం లేదని పిల్లలకు ఉద్యోగాలు రావని ఆవేదనతో ఉన్నారన్నారు.
ధర్నాలు చేసినప్పుడే చెప్తామంటే కరెక్ట్ పద్ధతి కాదు..
ప్రతి నెల రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలని లేని పక్షంలో ఈనెల 20వ తేదీ నుండి నిరవధిక సమ్మె గాంధీ మార్గంలో చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐటీయూసీ యూనియన్ నుంచి పలాన తారీకు నుండి మెడికల్ బోర్డు అని, ఐ ఎన్ టి యు సి యూనియన్ నుండి పలాన తారీకు నుండి మెడికల్ బోర్డు అని మెసేజ్ లు ఇప్పిస్తున్నారని, ఇలాంటి లీక్ వీరుల ప్రభుత్వం మనకు వద్దన్నారు. ఏదైనా భాజప్తిగా ప్రకటన ఇవ్వాలన్నారు. ధర్నాలు చేసినప్పుడే చెప్తామంటే కరెక్ట్ పద్ధతి కాదన్నారు. ఎవరైతే డిపెండెంట్ ఏ తారీఖున అప్లికేషన్ పెట్టారో అదే తేదీని ప్రాతిపదికన తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో 3000 మందికి అలియాస్ పేర్లు ఉన్నాయని, పదవ తరగతి పాస్ కాలేదని 150 మందిపై కార్మికులపై విజిలెన్స్ కేసులు పెట్టారని, పదవ తరగతి పాస్ కావడానికి సింగరేణి ఉద్యోగానికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. 17 గనులు డిస్టర్బ్ అవుతున్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం మనకే అలగేట్ చేయాలన్నారు.
ముందస్తుగానే భారీ పోలీస్ బందోబస్తు పెట్టి...
ఐటీ మీద పర్చ్‌ని రిమూవ్ చేయాలని పక్షంలో ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను కాపాడాలన్నారు. ప్రభుత్వం సింగరేణి సంస్థకి 50 వేల కోట్ల బాకీ ఉందని, అందుకే యాజమాన్యం కార్మికులు ఏమి అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు సేఫ్టీ ఎంతో ముఖ్యమని నాణ్యతలేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు సేఫ్టీ కోసం పనిచేయాలన్నారు. బయ్యారం ఉక్కు గదిని సింగరేణి కేటాయించాలని, దీనివల్ల సింగరేణి బాగుంటుందని ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థకి హౌసింగ్ బోర్డ్ పెట్టి రిటైర్డ్ అయిన కార్మికులకు జిల్లా కేంద్రంలో ప్లాట్స్ ఇవ్వాలని కోరారు. అసలు పోలీసులకు సింగరేణి లోకి వచ్చే అధికారం లేదని, మా పర్యటన ఉందని తెలిసి ముందస్తుగానే భారీ పోలీస్ బందోబస్తు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా భయపడకుండా కార్మిక బలంతో లోపలికి రావడం జరిగింది అన్నారు. టిఆర్ఎస్, హెచ్ఎంఎస్ యూనియన్‌లో సింగరేణి కార్మికుల కోసం, వారి హక్కుల కోసం నిత్యం పోరాటం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, రమేష్, శ్రీలత, సారయ్య, అనిల్ రెడ్డి, వీరన్న, జనార్ధన్, పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






