300 మంది బాలికలకు ఒక్క టీచర్.. KGBVలో విద్యాబోధన అస్తవ్యస్తం

by Kodari Anjali |

తిమ్మాజిపేట మండల మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుతో విద్యాబోధన పూర్తిగా కుప్పకూలింది.

300 మంది బాలికలకు ఒక్క టీచర్..  KGBVలో విద్యాబోధన అస్తవ్యస్తం
X

దిశ, తిమ్మాజిపేట: మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుతో విద్యాబోధన పూర్తిగా కుప్పకూలింది. గురువారం నాడు పాఠశాలలో సుమారు 300 మంది బాలికలకు బోధించడానికి ఒక్క మ్యాథ్స్ టీచర్ మాత్రమే విధులకు హాజరయ్యారు. మొత్తం 11 మంది టీచింగ్ స్టాఫ్‌లో మిగతా 10 మంది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, PET, ANM, కంప్యూటర్ టీచర్లు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. అటెండర్ ఇద్దరు, 5 మంది వంటమనుషులు కూడా డ్యూటీకి రాలేదు. ఒక్క టీచర్‌తో 6 నుండి 10 తరగతుల వరకు 300 మంది విద్యార్థినులకు పాఠాలు చెప్పడం అసాధ్యమని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి బచ్చల వినోద్ కుమార్, హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన రాష్ట్ర విద్యాశాఖ కమిషన్, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌కు జిల్లా డీఈవో ఫిర్యాదుకు చేశారు. ఇదే పాఠశాలలో చదువుతున్న కుమ్మర గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ నెల మూడవ తేదీన గోడ దూకి ఇంటికి పారిపోయారు. సదర్ విద్యార్థులను నాల్గవ తేదీ రోజు విదార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకొచ్చేవరకు ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది గమనించకపోవడం గమనార్హం,.వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల బాలికల చదువు కోసం పెట్టిన KGBV పాఠశాలలను అధికారులు గాలికి వదిలేశారని ఆరోపించారు.

Next Story