తల్లితో కలిసి తండ్రిని కడతెర్చిన తనయుడు..

by Kodari Anjali |

కుమారుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఘటన సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కకాశిపల్లిలో జరిగింది.

తల్లితో కలిసి తండ్రిని కడతెర్చిన తనయుడు..
X

దిశ, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కకాశిపల్లికి చెందిన సయ్యద్ గోరెమియాను గురువారం రాత్రి భార్య, కుమారుడు కలిసి మట్టి పెల్లతో కొట్టి హత్య చేశారు. సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నాయని, కొద్దిరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారని తెలిపారు. ఆయినా గొడవలు సద్దుమనగకపోవడంతో సయ్యద్ గోరేమియా రెండు నెలలుగా మెట్ పల్లి ప్రాంతానికి వెళ్లి నివసిస్తున్నాడని వెల్లడించారు. మూడు రోజుల క్రితం తురకకాశి పల్లెకు వచ్చి సయ్యద్ గోరమియా తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటున్నాడని తెలిపారు. అయితే గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భార్య వద్దకు వెళ్లాడు. భార్య, కుమారుడితో గొడవ పడ్డాడని, దీంతో కుమారుడు సయ్యద్ అలీ (18) మట్టి పెల్లతో తండ్రి తలపై బలంగా కొట్టాడని తెలిపారు. తర్వాత తల్లి వద్ద ఉన్న నీళ్ల సీసాతో కొట్టడంతో చనిపోయాడని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Next Story