పర్సనల్ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు.. సీఐపై భార్య ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

తెనాలి సీఐ రాములు నాయక్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఏస్పీని కలిసి కంప్లైంట్ ఇచ్చింది.

పర్సనల్ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు.. సీఐపై భార్య ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెనాలి సీఐ రాములు నాయక్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఏస్పీని కలిసి కంప్లైంట్ ఇచ్చింది. తన మొదటి భర్తతో విభేదాల సమయంలో ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనను అప్పటి ఎస్ఐ రాములు నాయక్ ట్రాప్ చేశాడని మహిళ ఆరోపించింది. శ్రీశైలంలో తనను వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు మరో మహిళతో సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు ప్రాణహాని ఉందని, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియా లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పింది. ముప్పై లక్షలు ఇస్తానని చెబుతున్నాడని, వాటితో బంగారం కొనుక్కుని తనను వదిలేయాలని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మహిళ చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారు. ఇటీవల పల్నాడు సీఐ వ్యవహారం సైతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాములు నాయక్ వ్యవహారం బయటకు రావడంతో మరింత చర్చగా మారింది.

Next Story