మేము సేఫ్... మాకు మధ్యవర్తులు ఉన్నారు

by Taduka Kalyani |

చేర్యాల మండల పరిధిలోని వివిధ కార్యాలయాల్లో అధికారుల చేతివాటం జోరుగా నడుస్తుంది.

మేము సేఫ్... మాకు మధ్యవర్తులు ఉన్నారు
X

దిశ, చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని వివిధ కార్యాలయాల్లో అధికారుల చేతివాటం జోరుగా నడుస్తుంది. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేయడం ఆ అమౌంట్ ను తెల్ల పేపర్ మీద పెన్సిల్ తో రాయడం,ఆ అమౌంట్ ను మధ్యవర్తుల ద్వారా వసూలు చేయడం షరా మామూలు అయ్యింది. ఇదంతా చేర్యాల ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న తతంగం.. గతంలో కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెండు రోజుల క్రితం చేర్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారుల తీరే నిదర్శనం. ఇక మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకటైన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి డాక్యుమెంటుకు ఒక రేటు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులు డైరెక్ట్ గా వెళితే పొంతన లేని వివిధ రకాల పత్రాలు కావాలని సవాలక్ష కండిషన్లు. అదే డాక్యుమెంట్ రైటర్లు వెళితే కండీషన్లు కట్ చేసి క్షణాల్లో పని పూర్తి చేయడం. కారణం తెల్ల పేపర్ మీద రాసిన పెన్సిల్ గీతల మహత్యం.ఇక రవాణా శాఖ కార్యాలయంలో కూడా కన్సల్టెంట్ మధ్యవర్తి లేకుండా స్వయంగా అర్జీదారుడు వెళ్తే సర్టిఫికెట్లు టెస్టులు అంటూ సవాలక్ష కండిషన్లు పెట్టి పనిని పక్కకు పెట్టడం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా వసూలు చేయడం తో సేఫ్ గా ఉంటున్నాము అనుకుంటున్నారు. ఐతే అధికారులకు మధ్యవర్తుకు వాటాల్లో తేడాలు రావడంతో హ్యాండ్ ఇచ్చి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించడం కొసమెరుపు. ఇప్పటికైన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించాలని, అవినీతికి పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story