- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూరి జగన్నాథ్ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు నష్టపోరు.. కారణం చెప్పిన నందిని రెడ్డి
పూరి జగన్నాథ్ గారు వేగంగా మూవీలను పూర్తి చేస్తారని, అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా పెద్దగా నష్టాలు రావని నందిని రెడ్డి తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహిళా దర్శకుల్లో నందిని రెడ్డి ఒకరు. తాజాగా ఆమె దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి, దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ నాతో సినిమా చేసిన ఏ నిర్మాత కూడా నష్టపోలేదు. అందుకు ప్రధాన కారణం సినిమాను తక్కువ రోజుల్లో, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడమే.
నేను దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించే ముందు ఒకరు నాకు పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పారు. ఆయన చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తారని, అలాగే ముందుగా నిర్ణయించిన బడ్జెట్‌లోనే చిత్రాన్ని తెరకెక్కిస్తారని అన్నారు. అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావని చెప్పారు. నేను కూడా అదే విధానాన్ని అనుసరిస్తాను. సినిమాకు అవసరమైన చోట నిర్మాతతో ఖర్చు పెట్టిస్తాను. కానీ అనవసర ఖర్చులకు మాత్రం ఎప్పుడూ అవకాశం ఇవ్వను. సినిమాలను వేగంగా, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే నా సినిమాల్లో కొన్ని ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావడం లేదుని నందిని రెడ్డి తెలిపారు.






