- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ బ్యూరోక్రసీలో కీలక పరిణామం.. ఐదుగురు అధికారులకు IAS హోదా
by Kema Shiva Kumar |
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అధికారులకు ఐఏఎస్ (IAS) హోదా లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ (Bureaucracy)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న ఐదుగురు అధికారులకు ఐఏఎస్ (IAS) హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఐఏఎస్ హోదా పొందిన అధికారులలో గోపీనాథ్, బాలకృష్ణ, జయకృష్ణ, పద్మావతి, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (DoPT) నుంచి వచ్చిన అధికారిక నోటిఫికేషన్ అనంతరం స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే ఐఏఎస్ హోదా పొందిన ఈ ఐదుగురు అధికారులకు కొత్త పోస్టింగులను కేటాయిస్తూ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Next Story






