TGECET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆఖరి విడత సీట్ల కేటాయింపు

by Kema Shiva Kumar |

తెలంగాణ ఈసెట్ (TGECET-2026) చివరి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి.

TGECET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆఖరి విడత సీట్ల కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ గ్రాడ్యుయేట్లకు ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఈసెట్ (TGECET-2026) చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీఈసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఇవాళ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈసెట్-2026 పరీక్షలో మొత్తం 17,768 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కౌన్సెలింగ్‌లో భాగంగా 12,242 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. చివరి విడతలో 8,274 మంది అభ్యర్థులు మొత్తం 2,59,227 ఆప్షన్లను ఎంచుకున్నాన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న మొత్తం 15,064 సీట్లకు గాను.. మొదటి, చివరి విడత కౌన్సెలింగ్ కలిపి ఇప్పటి వరకు 9,699 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌లో 13,767 సీట్లకు గాను 9,667 సీట్లు భర్తీ అవ్వగా, ఫార్మసీలో 1,297 సీట్లకు గాను కేవలం 32 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 503 మంది అభ్యర్థులు సీట్లు పొందారు.

Next Story