- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగాధర తహసీల్దార్ కార్యాలయంలో సమయపాలన గాలికే?
గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా పలు సెక్షన్లలో సిబ్బంది కనిపించకపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిశ, గంగాధర: గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా పలు సెక్షన్లలో సిబ్బంది కనిపించకపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర రెవెన్యూ సేవల కోసం వచ్చిన వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యాలయంలోని పలు సెక్షన్లలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు అత్యవసరంగా అవసరమైన సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని వారు వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్ అంబటి రజితను వివరణ కోరగా, డిప్యూటీ తహసీల్దార్, గిర్ధవార్, జీపీఓలతో పాటు ఇతర సిబ్బంది కూడా ప్రభుత్వ "సర్" కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కార్యాలయంలో అందుబాటులో లేరని ఆమె తెలిపారు. కార్యక్రమం ముగిసిన వెంటనే సిబ్బంది కార్యాలయానికి చేరుకుని పెండింగ్ పనులను పూర్తి చేస్తారని వివరించారు. అయితే, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.






