- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమెకు టీవీల్లో కనిపించాలనే పిచ్చి.. కవితపై మాజీ ఎమ్మెల్యే గండ్ర ఫైర్
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆమెకు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కనపడుతోందని, కేవలం టీవీల్లో, మీడియాలో కనపడాలనే తాపత్రయంతోనే ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగరు?
తెలంగాణ ఉద్యమకారుల ప్రస్తావన తెస్తూ.. "కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది ఉద్యమకారులు అమరులయ్యారు. మరి ఆనాడు అధికారంలో ఉన్న, ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించరు?" అని గండ్ర ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ నుంచి సహాయం ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో కవితకు ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా? అందుకే వారిని వదిలేసి మాట్లాడుతున్నారా? అని గండ్ర వెంకటరమణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.






