- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి.. జనసేన నేతలకు పవన్ దిశానిర్దేశం
జనసేన నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. గురువారం రాత్రి పవన్ విజయవాడలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. గురువారం రాత్రి పవన్ విజయవాడలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో... అదే సమయంలో జనసేన శ్రేణులతో మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలన్నారు. వారి సాధక బాధకాలు తెలుసుకుని భరోసా ఇవ్వాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుండి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తెలియచేయాలన్నారు. ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా వెళ్ళిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు పవన్ అభినందనలు తెలిపారు.






