- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోరాయించిన ఆర్టీసీ బస్సు.. తప్పని ట్రాఫిక్ తిప్పలు
by Kodari Anjali |
ప్రయాణిస్తున్నా ఆర్టీసీ బస్సు ఆకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది.

X
దిశ, నాచారం: ప్రయాణిస్తున్నా ఆర్టీసీ బస్సు ఆకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కుషాయిగూడ డిపో చెందిన 250 చర్లపల్లి టు సికింద్రాబాద్‌కి వెళ్తుంది. నాచారం హెచ్ఎంటి దాటగానే ఐఐసీటీ గేటు ఎదురుగా రోడ్డు మధ్యలో బస్సు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కనిపించని ట్రాఫిక్ పోలీసులు:
రోడ్డు మధ్యలో నిలిచిపోయిన బస్సుతో ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం వేళల్లో కార్యాలయాలకు హాజరయ్యే పలువురు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
Next Story






