- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకొండ చేనేత సహకార సంఘం ఏకగ్రీవంగా ఎన్నిక..
స్థానిక చేనేత కార్మికుల సహకార సంఘం (రిజిస్ట్రేషన్ నెంబర్: 20084/1952) నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.

దిశ, దేవరకొండ టౌన్: స్థానిక చేనేత కార్మికుల సహకార సంఘం (రిజిస్ట్రేషన్ నెంబర్: 20084/1952) నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. గురువారం నాడు ఎన్నికల అధికారి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సంఘ కార్యవర్గ సభ్యుల సమావేశంలో నూతన పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ వివరాలను ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షులుగా చేరిపల్లి బాలరాజు, ఉపాధ్యక్షులు చిలువేరు స్వామి నందీశ్వర్, కార్యదర్శి పున్న గోవర్ధన్, కోశాధికారి వనం శ్రీనివాసులు, డైరెక్టర్లుగా పులిపాటి నరసింహ, చిట్టిపోలు శ్రీధర్, పగిడిమర్రి శ్రీనివాసులు, గుర్రం విజయలక్ష్మి రాపోలు భారతమ్మ ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతన చేరిపల్లి బాలరాజు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ...చేనేత కార్మికుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.






