దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. ఫస్ట్ లుక్ అదిరింది

by Pulgam srinivas |

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'DQ41' చిత్రానికి 'శ్రీ శ్రీ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా టైటిల్ రివీల్.. ఫస్ట్ లుక్ అదిరింది
X

దిశ, వెబ్‌ డెస్క్: మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇన్ని రోజులపాటు ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌ను ప్రకటించకపోవడంతో 'DQ41' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి 'శ్రీ శ్రీ' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ప్రశాంతమైన వాతావరణంలో గోడపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. దీంతో ఇది ఓ హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది.

పోస్టర్‌పై "Love Will Spark Again" అనే ట్యాగ్‌లైన్‌ను జోడించడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి రవి నెలకుడిటి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే, ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్, ఫీల్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని పెంచుతున్నాయి.




Next Story