మెగాస్టార్ డెడికేషన్‌కు మరో నిదర్శనం.. వర్షంలో గంటల తరబడి షూటింగ్

by Pulgam srinivas |

70 ఏళ్ల వయసులోనూ భారీ వర్షంలో గంటల తరబడి యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొని చిరంజీవి మరోసారి తన డెడికేషన్‌ను చాటుకున్నారని సమాచారం.

మెగాస్టార్ డెడికేషన్‌కు మరో నిదర్శనం.. వర్షంలో గంటల తరబడి షూటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులోనూ ఆయన తన ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా ప్రతి సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన మరోసారి తన అంకితభావాన్ని చాటుకున్నట్లు తెలుస్తోంది. చిత్రంలోని ఓ కీలక యాక్షన్ సన్నివేశాన్ని భారీ వర్షంలో చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ ఎపిసోడ్ కోసం చిరంజీవి గంటల తరబడి వర్షంలో తడుస్తూనే షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేయడానికి ఆయన చూపిన నిబద్ధతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ సినిమా కోసం ఇంతలా శ్రమిస్తూ, ప్రతి సన్నివేశాన్ని ఎంతో అంకితభావంతో చేయడం వల్లే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ హీరోగా ఎదిగి, ఇప్పటికీ అదే స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story