Corona: ఏపీలో మళ్లీ కరోనా టెర్రర్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి పాజిటివ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-10 05:48:26  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి, మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Corona: ఏపీలో మళ్లీ కరోనా టెర్రర్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రంపంచాన్ని అతలాకుతలం చేసినా కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా కడప (Kadapa) జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల కొందరికి చేసిన ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, కడప నగరంతో పాటు రాజంపేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

పూణే ల్యాబ్‌కు శ్యాంపిల్స్..

అయితే, మృతుల వివరాలు తెలిసిన వెంటనే వైద్య అధికారులు రంగంలోకి దిగారు. కడప, రాజంపేట (Rajampet)లోని బాధిత గ్రామాల్లో స్పెషల్ టీమ్స్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టుల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉన్నాయా అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారు. మృతుల మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను సేకరించి, ఉన్నత విచారణ కోసం పూణే (Pune)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపించారు. ఇక్క మరో ట్విస్ట్ ఏంటంటే.. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలపై ఇప్పటి వరకు వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Next Story