Kajal Agarwal: బికినీ.. ఇంటిమేట్ సీన్స్‌పై నా అభిప్రాయం ఇదే

by Pulgam srinivas |   (  Updated:2026-07-10 04:38:32  IST  )

బికినీ, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం తనకు ఎప్పుడూ అసౌకర్యంగానే అనిపిస్తుందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Kajal Agarwal: బికినీ.. ఇంటిమేట్ సీన్స్‌పై నా అభిప్రాయం ఇదే
X

దిశ, వెబ్‌ డెస్క్: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, సినిమాల్లో నటించే విషయంలో తన వ్యక్తిగత పరిమితుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. "బికినీ సన్నివేశాల్లో నటించడం నాకు ఎప్పుడూ అసౌకర్యంగానే అనిపిస్తుంది. అది నా వ్యక్తిగత విషయం అని నేను నమ్ముతాను. అందుకే అలాంటి సన్నివేశాల్లో తెరపై కనిపించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉండేదాన్ని కాదు. అలాగే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం కూడా నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ విషయంలో నేను నా వ్యక్తిగత పరిమితిని గీసుకున్నాను.

ఆ హద్దును ఎప్పుడూ దాటకూడదని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ ప్రారంభమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ, మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు, స్కిన్ షో వంటి అంశాలకు దూరంగానే ఉంటూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో భాగంగా కాజల్ నటించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో 'NBK111' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

మెడలో హారం, చేతికి గాజులతో భాగ్యశ్రీ బోర్సే అందాల మెరుపు

Next Story