- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దారుణం.. ఆస్పత్రికి తీసుకెళ్లమంటే అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆటో ఎక్కిన మహిళపై ఆ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళ ఉప్పల్‌లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కి, ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆటో ఎక్కిన మహిళపై ఆ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మహిళ ఉప్పల్‌లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కి, ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. అయితే, ఆటోడ్రైవర్ మార్గమధ్యలో భరత్‌నగర్‌లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్సిల్ తీసుకున్నాడు.
అనంతరం మహిళను ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి తాగించాడు. మహిళ స్పృహ కోల్పోయిన తరవాత అత్యాచారానికి పాల్పడి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్‌తో పాటు నగదు లాక్కుని అక్కడే వదిలేసి పరార్ అయ్యాడు. మహిళ స్పృహలోకి వచ్చిన తరవాత పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందం, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి కేవలం 24 గంటల్లోనే నిందితిడిని అదుపులోకి తీసుకున్నారు.






