తలపతి విజయ్ ఖాతాలో మరో రేర్ రికార్డు.. ఇండియన్ హిస్టరీలో ప్రత్యేక స్థానం

by Pulgam srinivas |

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో సినిమా విడుదల చేసిన నేతల జాబితాలో విజయ్ చేరబోతున్నారు.

తలపతి విజయ్ ఖాతాలో మరో రేర్ రికార్డు.. ఇండియన్ హిస్టరీలో ప్రత్యేక స్థానం
X

దిశ, వెబ్ డెస్క్: తలపతి విజయ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలో విడుదల కానున్న 'జన నాయగన్' చిత్రంతో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారనే చర్చ జరుగుతోంది. అది ఏంటంటే... ఇప్పటివరకు పలువురు సినీ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సీనియర్ ఎన్టీఆర్, తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎంజీఆర్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే తమ సినిమాలను విడుదల చేసిన జాబితాలో సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్ సరసన విజయ్ కూడా చేరనున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొల్పిన 'జన నాయగన్' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా మమితా బైజు కీలకపాత్రలో కనిపించబోతుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాపై విజయ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story