- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విట్జర్లాండ్‌లో హైదరాబాద్ దంపతుల మిస్సింగ్ కేసులో మరో కొత్త కోణం
స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన దంపతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. నగరంలోని చర్లపల్లిలో నివాసం ఉంటున్న పబ్బా చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్ 22న హైదరాబాద్ నుండి స్విట్జర్లాండ్ కు బయలుదేరారు.

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన దంపతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. నగరంలోని చర్లపల్లిలో నివాసం ఉంటున్న పబ్బా చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్ 22న హైదరాబాద్ నుండి స్విట్జర్లాండ్ కు బయలుదేరారు. అయితే ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన కుమార్తె చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల మిస్సింగ్ పై కేసు నమోదు చేశారు. అయితే విచారణలో మరో కొత్తకోణం బయటపడింది.
వారం రోజుల క్రితమే చంద్రశేఖర్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అధిక వడ్డీ ఆశ చూపించి రూ.50 కోట్లు వసూలు చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేసి స్విట్జర్లాండ్ పారిపోయినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దంపతులు మిస్ అయ్యి ఇప్పటికే దాదాపు 18 రోజులు అవుతోంది. అయినప్పటికీ తమ తల్లిదండ్రుల జాడ తెలియకపోవడంతో కూతురు టెన్షన్ పడుతున్నారు.






