రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పక్కనున్న డ్రైనేజీలో పసికందు

by Kodari Anjali |

రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పక్కనున్న డ్రైనేజీలో పడేసిన పసికందును గుర్తించి రైల్వే కార్మికురాలు అక్కున చేర్చుకుంది.

రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పక్కనున్న డ్రైనేజీలో పసికందు
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజీలో పసికండు ఏడుస్తుండటాన్ని ఓ మహిళా శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి చేరదీసింది. పుట్టిన బిడ్డ తమకు వద్దు అనుకున్నారో.. లేక తొందరపడి బిడ్డకు జన్మను ఇవ్వడం తన జీవితానికి ఆటంకం కలుగుతుందని భావించిందో.. కానీ వారం రోజుల వయసు కూడా లేని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్లారు. డ్రైనేజీ సమీపంలో ఎప్పుడు వదిలేసి వెళ్లారో తెలియదు కానీ రైళ్ల శబ్దాల కారణంగా ఆ పసికందు ఏడుపులు ఎవరికి వినిపించలేదు. శుక్రవారం ఉదయం కాలకుృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన మహిళ పసికందును గుర్తించి రైల్వే శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు వారు మహబూబ్ నగర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Next Story