- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ తరఫున విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండని జి.ఎం మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు అన్నారు.

దిశ, నర్వ: ‘రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4000 కే కుదించాలని ఆలోచనను విరమించుకోవాలని మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో జి.ఎం మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడారు. ‘విద్యాశాఖకు పూర్తిస్థాయిలో మంత్రిని వెంటనే నియమించాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లను పాఠ్యపుస్తకాలు అందించాలి. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి, అక్షయపాత్ర, ఇస్సాను, మన్నా వంటి సంస్థలకు కాకుండా మహిళా సంఘాల ద్వారానే అమలు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అన్నారు. తమిళనాడు తరహా ప్రభుత్వ విధానాలు అవలంబించాలి. ఖాళీగా ఉన్న D E O, M E O అండ్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి. ఇంటర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా నిధుల కేటాయించాలి. విద్యాహక్కు చట్టం అమలు చేసి 25% పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి.
నర్వ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు
కాంగ్రెస్ విద్యారంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ఐదు లక్షల విద్య భరోసా కార్డులు ఉచిత లాప్టాప్ లు అందించాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా తెరిచిన పుస్తకాలు యూనిఫామ్ నోటుబుక్కుల విక్రయ కేంద్రాలను వెంటనే మూసివేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి’ అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్‌లో ఉన్న బకాయిలు 10,500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి జీవో నెంబర్ 7,8,9 లను రద్దు చేయాలి మాట్లాడారు. నడిగడ్డ ప్రాంతమైన నర్వ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. మక్తల్ నియోజక వర్గంలోని అన్నిమండలాల్లో 7 అమరచింత, ఆత్మకూర్ కలుపుకొని మండలాల నుండి ప్రభుత్వ ఆర్టీసీ బస్సును విద్యార్థుల సమయానికే నడపాలి. అది కూడా అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించి, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. అందుకే సకలజనులు పూర్తిగా ఉచిత విద్యకై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంతో కలిసి రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు.






