మెడలో హారం, చేతికి గాజులతో భాగ్యశ్రీ బోర్సే అందాల మెరుపు

by Pulgam srinivas |   (  Updated:2026-07-10 04:31:42  IST  )

మెడలో హారం.. చేతులకు గాజులు.. భాగ్యశ్రీ బోర్సే ఎలిగెంట్ లుక్ వైరల్

మెడలో హారం, చేతికి గాజులతో భాగ్యశ్రీ బోర్సే అందాల మెరుపు
X

దిశ, వెబ్‌ డెస్క్: సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటీమణుల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు.

ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. తాజాగా అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొనగా, ఈ సినిమాతో భాగ్యశ్రీకు బ్రేక్ దక్కుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఆమె కెరీర్‌కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ భాగ్యశ్రీ బోర్సే యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

మోడ్రన్ లుక్‌తో పాటు అప్పుడప్పుడు ట్రెడిషనల్ అవతార్‌లోనూ మెరిసి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లంగా-వోణీలో దర్శనమిచ్చింది. రెండు చేతుల నిండా గాజులు, మెడలో సొగసైన హారం, పెద్ద ఇయర్‌రింగ్స్ ధరించి, కురులను అందంగా వెనక్కి వదులుతూ కెమెరాకు స్టైలిష్‌గా పోజులిచ్చింది.

సంప్రదాయ హుందాతనం, సహజమైన అందం కలగలిసిన ఈ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story