దారుణం.. సొంత అక్క తల నరికి సెల్ఫీ దిగిన తమ్ముడు

by  |
దారుణం.. సొంత అక్క తల నరికి సెల్ఫీ దిగిన తమ్ముడు
X

దిశ, వెబ్ డెస్క్: ఔరంగాబాద్‌లోని వైజాపూర్ తహసీల్‌లోని గోయ్‌గావ్ అనే చిన్న వ్యవసాయ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం తల్లి సహాయంతో సోదరి తల నరికిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంకేత్ (18) అతని తల్లి శోభ(40)తో కలిసి బాధితురాలు కీర్తి, (19) ని కొడవలితో గొంతు కోసి హత్య చేసి కొద్ది గంటల తర్వాత లొంగిపోయారు. బాధితురాలు కీర్తి, అదే గ్రామానికి చెందిన థోర్ (23) ఆరు నెలల క్రితం పారిపోయి పూణేలోని, అలండిలో వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆ జంట తిరిగి గ్రామానికి వచ్చారు.

వారు తిరిగి వచ్చినట్లు తెలుసుకున్న తల్లి-కొడుకులు కీర్తి ఇంటికి కలవడానికి వెళ్లారు. ఆ తర్వాత వారి సాన్నిహిత్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు బాగానే మాట్లాడిన తల్లి కొడుకులు టీ పెట్టడానికి వంట గదిలోకి వెళ్లిన కీర్తిని అనుసరిస్తూ వెళ్లారు. అక్కడ శోభా మోతే కీర్తి కాళ్ళను గట్టిగా పట్టుకుంది, సంకేత్ కొడవలితో తల నరికాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే చనిపోయిన కీర్తి తలను పట్టుకుని సోదరుడు సంకేత్ సెల్ఫీ దిగి దానిని అందరితో పంచుకున్నట్లు గోయ్‌గావ్ పోలీస్ పాటిల్ (పిపి) సూర్యకాంత్ తేలిపారు.


Next Story