మద్యం మత్తులో.. అన్నపై తమ్ముడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే

by Mahesh |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అన్న‌పై తమ్ముడు దాడి చేసిన ఘటన జిల్లాలోని ఏ కొండూరు మండలం కంభంపాడులో కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని ఎస్టీ కాలనీలో చిట్టిపోతుల మధుబాబు, విశ్వానాథం అన్నదమ్ములు వారి కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నారు. అయితే శనివారం మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికిలోనైన అన్న మధుబాబు తలపై తమ్ముడు విశ్వనాథం రోకలిబండతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన మధు బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed