- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో A-3 నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో A-3 నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ఏసీబీ నిర్వహించిన సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, ఐదు ఇళ్ల స్థలాలు, రెండు ఇళ్లు, హైదరాబాద్ లో ఒక కమర్షియల్ భవనం, ఒక కేజీ బంగారు నగలు, బ్యాంక్ అకౌంట్లో రూ.3.83 లక్షల నగదు, సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన నగదును గుర్తించారు. వీటితో పాటు ఆయన ఇంటిలో 29 మద్యం సీసాలు కూడా లభించడంతో.. ఎక్సైజ్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న భుజంగరావు ఇంటిలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను నిన్న అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావును చంచల్ గూడ జైలుకు తరలించారు.






